చిన్నా
మాత్యుస్ ॥ గుర్తుపట్టని ఆనవాళ్ళు ॥
ఎక్కడ పుట్టావురా నువ్వు ?
ఎవడ్రా
వీడు!!
వీడిని
దూరంగా పంపండి ......
****
నువ్వేకడ
పుట్టావ్ అంటే
అక్కరలేక , విసిరేసిన
జవాబు
లేని తెల్ల కాగితాలుగా
నిత్యం
బలి అవుతూ .......,చెత్తకుప్పలో
ఎండకు
ఎండుతూ ,
వానకు
తడుస్తూ
ఒంటి మీద
నులిపోగులేకుండా
మానవత్వం
లేని రాక్షసులు
ఆడే ఆటకు
వేసే పాచికలుగా......,,, చెత్తకుప్పలో
తల్లి
ప్రేమతో మా కడుపు నింపుతూ
తన
పొత్తిళ్ళలో ఉండల్సినా మేము
సమాజ
మృగాలకు కనపడకుండా ఎదిగాం
కాలువల
వద్ద ,................చెత్త కుప్పల మాటునా
మా
చెత్తకుప్ప బ్రతుకులను... గుర్తుపట్టని ఆనవాళ్ళుగా
తల్లి
పెగుకి ఎడం చేసి సమాజానికి దూరంగా చేసిన
ఓ
మురికివాసనని మీరు చేసినదె కదా ...
03/08/2013
No comments:
Post a Comment