Monday, 21 September 2020

 ఒకరికొకరు ఊత కర్రలు

ఒకరినొకరు అనుసరించే
బలహీన అడుగుజాడలు
వారిద్దరు ఓ పండుటాకులు
అలసిన నవ్వులు
తడి ఆరిన కన్నులు
ఒకరినొకరు చూసుకుంటూ
వారిద్దరు కొన్ని గోరు ముద్దలు
మసక బారిన ప్రపంచం
ఒకరికొకరు తోడు నీడ
ఆకుపచ్చని ప్రేమ తోరణలలో
వారిద్దరు ఒక రాజు రాణి
అవును
వారిద్దరు లేత పచ్చని
స్వచ్ఛమైన ప్రేమ చిగురాకులు
చిన్న...
31.07.2020

Monday, 2 September 2013

।సన్మానించుకుందాం ... |

చిన్నా మాత్యుస్  సన్మానించుకుందాం ... |

ప్రపంచం జల్లెడ పట్టింది
రాలిపోయి.. మిగిలిన
కొన్ని బ్రతుకులు .. ఓ ఊరికి చేరుకున్నాయి

ఊరి పేరు : సమాజం
ఊరిలొ నా మొదటి అడుగులోనే
వయస్సు మళ్ళిన బ్రతుకు ఒకటి
ఎదురుపడింది ....
****
ఏం తాతా
ఎన్నేళ్ళు ఈ ఊడిగం నీకు
వయస్సు మీదకోస్తాంది
జరా చూసుకొరాదె ??
***
పచ్చనోటు ముసుగు ఫలితం బిడ్డా
మేము ఎండిన చెట్లకి ఎండుటాకులం
అనురాగాలు ఆప్యాతలు కలుషితమై 
బంధు భాందవ్యాలు రాలిపోయి   
తోటి మనిషిని ఒక మనిషిగా చూడని
ఈ ఊరిలో భయంకరమైన మూడ నమ్మకాలు 
మా అంతరాలను పట్టి పీడిస్తూ
కుల కులట జల్లెడపట్టి ఈ ఊరి
చివరన విసిరేసింది అని కంట తడి పెట్టుకున్నాడు   
ఆ ముసలి బ్రతుకు వేదనను
వింటూ ముందుకు సాగాను..
అబ్బా ఏంటి ఈ కమురు వాసనా
ముక్కులు పగిలిపోతున్నాయి
గుడ్డ పేలికలు కాలుతున్నాఏమో ...
అనుకున్నా ... నా పొరపాటే ..
వాళ్ళను చూసాక తెలిసింది.
ఎన్నో ఏళ్ళ నుండి గంజి నీళ్ళతో
ఆర్పుతూ...  అవి కూడా దొరకకా
పక్కటెముకల కట్టెల క్రింద
కాలుతున్న ఆకలి పేగుల వాసన అని
***
ఎవరు వీళ్ళు ??
వీళ్ళకి ఎవరు లేరా ? అనే ప్రశ్నకు
గుండె పగిలేల ఓ నిజం తెలిసింది
ఎవరో కాదు వీళ్ళు ...!!! 
బీటలు బారిన భూముల్లో
ఎండి పోయిన మోడుకి
రాలిపోయే ఆకుల్లా జీవచ్ఛవాలుగా
ప్రేమానురాగాల గాలి కోసం
ఎదురు చూస్తున్నా
ఎండిపోయిన  కడుపులు
ఆకలి రుచి మరిచి పోయిన
కొన్ని బ్రతుకులు .
సర్వం అనుకున్నా కొడుకులు
విడిచిన తల్లులు తండ్రులు వాళ్ళు అని....
***
గుర్తుంచుకుందాం !!
తల్లి తండ్రులను భారం అనుకోవద్దు
ఇది మన భాద్యత అని తెలుసుకొని
వారిని సన్మానించుకుందాం ...


02/09/2013

అసలు ఏంటో ఈ ప్రపంచం

చిన్నా మాత్యుస్  .అసలు ఏంటో ఈ ప్రపంచం  |

ఏంటి ఈ ప్రపంచం ?
తెల్లారితే ఈ పచ్చటి పగటి ప్రపంచంపై
రంగులద్దుతున్నాయి రక్తపు రాత్రులు,.,

మొన్నటికి మొన్నా
నన్ను వదిలేయండి ప్లీజ్ !! అని
బతిమిలాడి , కాళ్ళు పట్టుకొని గోజాడుకున్నా  
వదలకుండా ఈడ్చుకొని వెళ్లి 
బట్టలు చింపి తన పైసాచికత్వపు
ప్రవర్తనతో అవయవాల ప్రదర్శన 
చేసిన ఆ క్రూరమైన మనుషులు
కాదు!!క్రూరమైన జంతువులు 
ఈ పచ్చటి పగటి ప్రపంచంపై
పరిగెత్తించి వేదించి వంచించిన
ఓ ఆడకుతురి రక్తపు సిరా మరకలు
అడ్డదిడ్డంగా పడిన ఎరుపు గురుతులు
ఇంకా చెరగనేలేదు.. అప్పుడే ఇంకో దారుణం.
***
రోడ్డుపై చిరిగినా బట్ట ముక్కలు
నేను రాను .. వదలండి అని
వెనక్కి లాగుతున్న కాళ్ళ గురుతులు
క్రూరంగా ఈద్చుకెల్తూ పడిన రక్తపు గీతలు
చూస్తూ చూస్తూనే ఎదురుగా ముల్లకంపలో
బీతిగోల్పు అరుపుల మద్య తన గొంతు నొక్కి
చెరిపిన మరో ఆడకూతురూ ,కొన ఊపిరితొ....... 
చూసిన  నా కనులే చమ్మగిల్లాయి అంటే
చెరిగిపోయిన ఆ అడకుతురి జీవితం


యెంత రోదిస్తుందో . ఈ సిగ్గుమాలిన ప్రపంచం లో 
ఉండలేక మంటల వెనక దాక్కుంది ..చివరికి
ఓ గురుతులా మిగిలిపోయింది ...

అసలు ఏంటో ఈ ప్రపంచం !!
నీకై శ్రమిస్తూ, నీ వెనకుండి ప్రోత్స్తాహిస్తున్నా
పాపం ఆ ఆడ కూతురూ
నిత్యం బలి గొంతు నొక్కి  చెరిపే ...... ఈ కీచక చేతుల్లో... 

30/08/2013


Saturday, 24 August 2013

అంధత్వ కత్తిపోటు

30JUL2013
రాష్ట్ర నడిబొడ్డున దిగబడిన అంధత్వ కత్తిపోటు
ముక్కలుగా చీల్చుతూ....ఇది నాది అని ఏరుకుంటూ

ఎర వేసిన పచ్చ నోటుకు ఆశ పడ్డాం
మోసపోయిన బ్రతుకులు మావి ..
మా ఓట్ల గొంతు నలిపి చంపాము కదా 

కొన్నేళ్ళ క్రితం అవతరించన ఆంద్ర రాష్ట్రం
ముక్కలు చేసి ఎవడికో దానంగా ఇచ్చి
చూస్తున్నాం మన అవతరణ కోసం నోళ్ళు ఎల్లపెట్టుకొని


చిన్న మత్యుస్

।.నిగ్గ దీసి అడుగు |

చిన్నా మాత్యుస్  .నిగ్గ దీసి అడుగు  |
వికృత చేష్టలు , ఉన్మాద చూపులు
బీతి గొల్పు అరుపుల మధ్య
అర్ధరాత్రి ఒక ఆడపిల్ల తిరుగుతుంటే
స్వాతంత్ర్యం  ఇంకా కొంచం
మిగిలే ఉంది అనుకున్న కాని
తెల్లారితే రక్తపు మడుగులో
మాంసపు ముద్దలా మారుతుంది
స్వాతంత్ర్యం  అబద్దం అని తెలుసుకున్న
వాళ్లకి ఎప్పుడు వస్తుందా అని 

ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ
మన ఐదు వేళ్ళను మన నోటికి
అందిచాలనే ప్రయత్నంలో
తన కడుపులో నాలుగు గంజి బొట్లు ,
పొలంలో గుప్పెడు విత్తనాలు వేస్తూ  
సిరిసంపదల మద్య ఊగాల్సిన
రైతన్నలు /... ఉరి కోయ్యలకు
ఊయలగా మారుతున్నారు
కల్తి మందు చల్లడం వల్ల
నమ్ముకున్న పంట చేతికి రాక ...

పూట గడవక, కడుపులో ఆకలి మంటకు
తట్టుకోలేక .సరైన తిండి,ఒంట్లో నీరు లేక
వచ్చి రాని  కన్నీళ్లను మింగి బ్రతుకును
నెట్టకొస్తున్నా ఈ పేదరికాన్ని
నిర్మూలించడానికి ఆ  బలిసినోల్ల వెనక
మగ్గుతున్న నోట్లకట్టలకు కాళ్ళు వచ్చేడెప్పుడని



ఇలాంటివి ఎన్నో ఈ నేటి ప్రపంచం లో
మేల్కొనండి యువతా 
మా వల్ల ఏం అవుతుంది అని అనుకోవద్దు
మన వల్లే అవుతుంది అని అనుకుందాం
భగ భగమని మండుతున్నరక్తాన్నిఆర్పొద్దు
కట్టలు తెంచుకున్న దైర్యాన్ని ఆపవద్దు 

నిగ్గ దీసి అడుగు ......
జరుగుతున్నా అరాచకాలకు
పారుతున్న నెత్తుటిలో
స్పర్స లేకుండా నిద్దరోతున్న
నేటి ప్రపంచాన్ని.


24/08/2013

॥ ఆ చెత్త కుప్పె నయం.... ॥

చిన్నామాత్యుస్ ఆ  చెత్త కుప్పె నయం....

ఎప్పుడు లోకాన్ని చూస్తామా
మనుషుల మధ్యకు ఎప్పుడు వద్దామా
అని నా చిన్నారి బాల్యం ఉరకలేసింది 
చెత్తకుప్పలో......కానీ వచ్చాక
లోకం అంటే ఇదేనా
మనుషులు ఉంటారు అన్నారు ...
అన్ని ముసుగులే ఇక్కడ.
 ****
ఇంతకన్నా మాకు అక్కరలేదు .. మేము పెంచాలేము
అని విసిరేసిన మమ్మల్ని..... ఎంగిలి  విస్తరులతో
మా రక్తపు మరకలను శుబ్రపరచి... నేనున్నా అంటూ 
తల్లిలా హక్కున చేర్చుకొని ఓ అక్కర లేని మిగిలిన అన్నాన్ని 
నీకో ముద్దా నాకో ముద్దా అని ఆటపట్టిస్తూ గోరుముద్దలు
తినిపించిన ఆ  చెత్త కుప్పె నయం....

చెత్తలో  ఏదో  ఒక రాతలు ,,
వాటి తల రాతలు...... కనపడే ప్రతి పేజి పైన.
మరి ఇక్కడ  ప్రతిది మానవత్వపు ముసుగే
దాని వెనక కనపడని ఎన్నో రాతలు ..క్రూరమైన కోతలు
ఏ ముసుగు వెనక దాగిందో  కుక్కలు నాకిన విస్తరాకుల
మద్య వదిలివెళ్ళిన మానవత్వం లేని ఆ మహా రాక్షసి .
****
నిజంగా అక్కర లేనివి ఎన్నో
ఈ లోకం లో చెత్త కుప్పల్లో....
మసి బారిన మా బ్రతుకుల్లా...

19/08/2013

|గుర్తుపెట్టుకో .......సొదరా |

చిన్నా మాత్యుస్  |గుర్తుపెట్టుకో  .......సొదరా |

అన్న నువ్వు సూపరు
నువ్వు కేక .... బ్రదర్స్ అంటే మనమే
ఎంతకాలం బాసు ఈ రియాలిటీ షోలు..
మీ 24 గంటల షో ని చూడలేని 
ఆ చుట్టుపక్కల నిర్జీవ మొఖాలు
......చూడు కొంచం..........
* * * * * *
అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ మొస్తూ
మనస్పర్దనలు తెస్తూ .... విడదీస్తూ
పక్కనొడు ఎలా ఉంటె మనకెందుకు
వాళ్ళ స్తితిగతులు ఎలా ఉంటె నీకెందుకు
పైకి చేయి చేయి వేసుకొని తిరుగుతూ
సాయంత్రానికి సిగిరెట్టు ముట్టిన్చినట్టుగా 
మీ మనసులకు  మీరే చిచ్చు పెడుతూ
అవి రెండు గొడవలు పడేట్టుగా చేస్తూ 
మేమంతా ఒకటే ... పైకి బాగానే ఉంటాం అని
పైగా బ్రదర్స్ ఒకే  ఇంటోల్లోం అనే ట్యాగ్ లైన్స్
కమ్యూనిటీలు , దానికి లైకులు ,కామెంటులు
ఏదో ఘనకార్యం చేసినట్టు శభాష్ లు   
ఎంతకాలం రా ఈ కాకమ్మ కథలు.,రోజుకి 4 ఆటలు...
బుర్రల్లో ఎదుటోడిపై పన్నాగాలు మానెయ్యి రా
పొగడ్తల నుండి బయటకు రారా
ఎంతకాలం మన చంకలు మనం కొట్టుకుంటాం
మన వెనక ఏమనుకుంటున్నారో తెలుసుకో
* * * * * * 
గుర్తుపెట్టుకో  .......సొదరా
చివరి మెతుకులు వదిలినంత ఈజీ కాదు
విడిపోయిన మనసులను కలపడం
అవే మెతుకులను పండించి చూడు
ఎండనక , వాననక సేద్యం చేసిన
రైతన్న మనసు తెలుస్తుంది
యెంత తప్పు చేశాను అని గుర్తుకొస్తుంది

14/08/2013