చిన్నామాత్యుస్॥ ఆ చెత్త కుప్పె నయం.... ॥
ఎప్పుడు
లోకాన్ని చూస్తామా
మనుషుల
మధ్యకు ఎప్పుడు వద్దామా
అని నా
చిన్నారి బాల్యం ఉరకలేసింది
చెత్తకుప్పలో......కానీ
వచ్చాక
లోకం అంటే
ఇదేనా
మనుషులు
ఉంటారు అన్నారు ...
అన్ని
ముసుగులే ఇక్కడ.
****
ఇంతకన్నా
మాకు అక్కరలేదు .. మేము పెంచాలేము
అని
విసిరేసిన మమ్మల్ని..... ఎంగిలి
విస్తరులతో
మా రక్తపు
మరకలను శుబ్రపరచి... నేనున్నా అంటూ
తల్లిలా
హక్కున చేర్చుకొని ఓ అక్కర లేని మిగిలిన అన్నాన్ని
నీకో
ముద్దా నాకో ముద్దా అని ఆటపట్టిస్తూ గోరుముద్దలు
తినిపించిన
ఆ చెత్త కుప్పె నయం....
చెత్తలో ఏదో ఒక
రాతలు ,,
వాటి తల
రాతలు...... కనపడే ప్రతి పేజి పైన.
మరి
ఇక్కడ ప్రతిది మానవత్వపు ముసుగే
దాని వెనక
కనపడని ఎన్నో రాతలు ..క్రూరమైన కోతలు
ఏ ముసుగు
వెనక దాగిందో కుక్కలు నాకిన విస్తరాకుల
మద్య
వదిలివెళ్ళిన మానవత్వం లేని ఆ మహా రాక్షసి .
****
నిజంగా
అక్కర లేనివి ఎన్నో
ఈ లోకం లో
చెత్త కుప్పల్లో....
మసి బారిన
మా బ్రతుకుల్లా...
19/08/2013
No comments:
Post a Comment