చిన్నా
మాత్యుస్ ।సన్మానించుకుందాం ... |
ప్రపంచం
జల్లెడ పట్టింది
రాలిపోయి..
మిగిలిన
కొన్ని
బ్రతుకులు .. ఓ ఊరికి చేరుకున్నాయి
ఊరి
పేరు : సమాజం
ఊరిలొ
నా మొదటి అడుగులోనే
వయస్సు
మళ్ళిన బ్రతుకు ఒకటి
ఎదురుపడింది
....
****
ఏం
తాతా
ఎన్నేళ్ళు
ఈ ఊడిగం నీకు
వయస్సు
మీదకోస్తాంది
జరా
చూసుకొరాదె ??
***
పచ్చనోటు
ముసుగు ఫలితం బిడ్డా
మేము
ఎండిన చెట్లకి ఎండుటాకులం
అనురాగాలు
ఆప్యాతలు కలుషితమై
బంధు
భాందవ్యాలు రాలిపోయి
తోటి
మనిషిని ఒక మనిషిగా చూడని
ఈ
ఊరిలో భయంకరమైన మూడ నమ్మకాలు
మా
అంతరాలను పట్టి పీడిస్తూ
కుల
కులట జల్లెడపట్టి ఈ ఊరి
చివరన
విసిరేసింది అని కంట తడి పెట్టుకున్నాడు
ఆ
ముసలి బ్రతుకు వేదనను
వింటూ
ముందుకు సాగాను..
అబ్బా
ఏంటి ఈ కమురు వాసనా
ముక్కులు
పగిలిపోతున్నాయి
గుడ్డ
పేలికలు కాలుతున్నాఏమో ...
అనుకున్నా
... నా పొరపాటే ..
వాళ్ళను
చూసాక తెలిసింది.
ఎన్నో
ఏళ్ళ నుండి గంజి నీళ్ళతో
ఆర్పుతూ... అవి కూడా దొరకకా
పక్కటెముకల
కట్టెల క్రింద
కాలుతున్న
ఆకలి పేగుల వాసన అని
***
ఎవరు
వీళ్ళు ??
వీళ్ళకి
ఎవరు లేరా ? అనే ప్రశ్నకు
గుండె
పగిలేల ఓ నిజం తెలిసింది
ఎవరో
కాదు వీళ్ళు ...!!!
బీటలు
బారిన భూముల్లో
ఎండి
పోయిన మోడుకి
రాలిపోయే
ఆకుల్లా జీవచ్ఛవాలుగా
ప్రేమానురాగాల
గాలి కోసం
ఎదురు
చూస్తున్నా
ఎండిపోయిన కడుపులు
ఆకలి
రుచి మరిచి పోయిన
కొన్ని
బ్రతుకులు .
సర్వం
అనుకున్నా కొడుకులు
విడిచిన
తల్లులు తండ్రులు వాళ్ళు అని....
***
గుర్తుంచుకుందాం
!!
తల్లి
తండ్రులను భారం అనుకోవద్దు
ఇది మన
భాద్యత అని తెలుసుకొని
వారిని
సన్మానించుకుందాం ...
02/09/2013
No comments:
Post a Comment