Showing posts with label || బిడ్డా ..నీ పదవికై వేసిన మా ఓట్లుకి||. Show all posts
Showing posts with label || బిడ్డా ..నీ పదవికై వేసిన మా ఓట్లుకి||. Show all posts

Wednesday, 15 May 2013

|| బిడ్డా ..నీ పదవికై వేసిన మా ఓట్లుకి||


|| బిడ్డా ..నీ పదవికై వేసిన మా ఓట్లుకి|| 
బిడ్డా ........
నీ పదవికై వేసిన మా ఓట్లుకి
నువ్వెదో ఒక దారి చుపిస్తావని అనుకున్నాం
కాని బానిస బ్రతుకుల దారి ఎడారే
అని మరోసారి గుర్తుచేసావ్…..,

అవును మేము తక్కువ కులం వాళ్ళమే
కాని ఎక్కువ కాలం మన్నించ గలిగినవాళ్ళం
మేము తక్కువ మతం వాళ్ళమే
కాని ఎక్కువ అర్ధం చేసుకునే వాళ్ళం
కుల రాక్షస ముసుగులో ఉన్న ఆ ముఖాన్ని కనిపెట్టలేకపోయాం
అందుకే కుల,మత బేధాలతో వేసే ఆ పోట్లకు బలి అవుతూనెవున్నాం

జనం కేకలు పెడుతున్నారు బిడ్డా...
ఎంతకాలం ఇంకెంతకాలం ఈ దౌర్జన్యం
సమాజంలో బీధబ్రతుకల, అనామకులపై ఈ కొట్టివేతలు
ఈ కుల, మత బేధాలతో వేస్తున్నఎర్ర రంగు సిరాలెన్తకాలమని

రాజకీయ వేత్తలార సున్నం కొట్టినా సమాదుల్లారా
లోపల కుల కుళ్ళుని , మత కుతంత్రాలను పెట్టుకొని
సమాజానికి పట్టిన కుళ్ళుని ఎలా తుడుస్తారయ్యా….
ఇకనైనా కుల కులట మాటల పోట్లకు ,
ద్వేషపు ముసుగు వేట్లకు స్వస్తి చెబుదాం
మన సమాజ మార్పుకై ప్రతి ఒక్కలం నడుం కడదామ్
13/05/2013 06.03pm