Showing posts with label ||నిశబ్దపు రాత్రి||. Show all posts
Showing posts with label ||నిశబ్దపు రాత్రి||. Show all posts

Friday, 26 July 2013

||నిశబ్దపు రాత్రి||


చిన్నామాత్యుస్  ||నిశబ్దపు రాత్రి||

నిశబ్దపు రాత్రి కునుకు రాక
అడుగుకి ముందడుగు వేస్తున్న నా నీడ
నే చేజారిన అడుగులను వెతుకుంటూ
చప్పుడైన ప్రతి అడుగును గమనిస్తూ

కళ్ళముందు కటిక చీకటి
కనుచూపుమేర లో రెండు అడుగులు
బహుసా నా ప్రియురాలి అడుగులా ?
కాదా ??అవునా ? అంటూ దగ్గరికి ..

రెండు కాంతి రేఖలు అటువైపుగా వాటి మీదుగా
చిక్కిన అడుగులతో అలసట మొత్తం ఎక్కడికో
నాకు తెలియకుండానే నా అడుగులు వెనక్కు వేసాయి
ప్రక్కనే ఏడు అడుగులు వేసిన పాదాలను చూసి
తను ఇప్పుడు ఒకరి సొంతం
అని అర్ధం చేసుకున్నా.. 

జ్వాల రగులుకుంది హృదయ శివారు
నలుదిక్కుల పిక్కటిల్లేలా వేదనతో
తదేకంగా కన్నీటి జల్లు సాయం
హృదయ శివారుల్లో మంటను ఆర్పుతూ
****
చివరికి యెద లోగిలిలో నిలిచిపోయాయి
గుండెపై తన్ని వెళ్ళిన ఆ పాదముద్రలు
ఓ జ్ఞాపకంగా .......,,, 
25/07/2013