Showing posts with label ||మట్టిలో కలసిపోయే ని ఈ మట్టి దేహాల కోసం ||. Show all posts
Showing posts with label ||మట్టిలో కలసిపోయే ని ఈ మట్టి దేహాల కోసం ||. Show all posts

Thursday, 4 July 2013

||మట్టిలో కలసిపోయే ని ఈ మట్టి దేహాల కోసం ||



మునుపటివలె మట్టిలో కలసిపోయే
ఈ మట్టి దేహాల కోసం  డబ్బు, పదవుల దగ్గర
ఈ తగాదాలు ఎందుకు బాసు

గుప్పెడు అన్నం కోసం కస్టపడి జానెడు పొట్టకి పెడితే
ప్రాణం ఉన్న 6 అడుగుల శరీరాన్నికాపాడుతుంది
ఆ రోజు కంటి నిండా నిద్ర నిస్తుంది ....

కాని మనది కాని డబ్బు,అహంకారం,
పగలు,పదవులతో చిన్న చూపు
ఆ అడుగుల కొలత గల మట్టి దేహానికి
ఐన వాళ్ళంటే ,ఆరు గజాల స్తలానికి చేర్చే ఆ నలుగురంటే ..

పాపం 6 అడుగుల శరీరానికి తెలియదు అనుకుంటా
ఈ లోకానికి సెలవు పెడితే వెళ్ళేది 6 గజాల గుంతలోకే గాని
బిల్దింగులకొ, పాలస్ లకు కాదని......

*****
కాని గుర్తుంచుకో బిడ్డా
మన చేతులతో మన్ను కూడ పట్టుకుపోవడం కుదరదని ...
చివరి రోజుల్లో నిన్ను ఆరు గజాల స్తలానికి చేర్చేది
ఆ నలుగురే నని ......

04/07/2013