|| బిడ్డా......ఎవరని
అడిగావా..,,.!!
||
బిడ్డా......ఎవరని
అడిగావా..,,
నీటి చుక్క
లేని కరుడుకట్టిన కరువు కాలలవి
తప్పటడుగుల
భర్త అడుగుజాడలను అనుసరించలేక
బ్రతుకు
తెరువుకు సరైన చుక్కాని లేకా
పొట్ట చేత
పట్టుకొని వలస వచ్చిన ఆడకూతురిని
***
అడుగు
ముందుకు పడని పరిస్తితిలో నవమాసాలు మోసి
ఈ భూమి మీద
పడ్డాక తన కాళ్ళకు మట్టి అంటకుండా
పెంచి, ఒక ప్రయోజికుడిగా గుర్తింపునిచ్చిన
ఈ సమాజంలో
కొడుకులు
కొన్ని మాసాలుగా పంచుకున్న మీ అమ్మను
***
బిడ్డా
......... యాదికితెచ్చుకో ...........,,
నువ్వు ఆకలి
కి ఏడుస్తుంటే నా కళ్ళు చమర్చాయి
సరైన తిండి,ఒంట్లో నీరు లేక ఆవిరి అయిపోతున్న
కన్నీళ్లను చూసి
ఎండిన మా
ఆకలి కడుపులు ఘోష పెడుతున్నాయి
ఎందుకంటె
..........................
కనీసం అవి
తాగి అయినా నీ ఆకలి చల్ల పరుద్దామని.......
07/05/2013
10:26 am
No comments:
Post a Comment