Wednesday, 15 May 2013

|| జాగ్రత్త చెల్లెమ్మ!!




 || జాగ్రత్త చెల్లెమ్మ!!
జాగ్రత్త చెల్లెమ్మ , జాగ్రత్త అక్కయ్య
మనిషి అనే ముసుగు వేసుకొన్నకొన్ని జాలి, కరుణ లేని మృగాలు
అడవి మూలాల్లో తిరగాల్సినవి జనారణ్యంలోకి తిరుగుతున్నాయి

భద్రంగానే ఉన్నాననే బ్రమలో ఉన్నవేమో
వికృతోన్మాదపు చేష్టలతో కిరాతకమైన చూపులున్న
రాతి యుగం లో ఉన్నవని గమనించుకొని
నలుదిక్కులా సంచరించు , నీ గమ్యాన్ని అధిగమించు    

ఏమిటో ఈ మృగ మగాళ్ళ క్రూరమైన కామోన్మాదులకు
ఇంకెన్నో లేడి కూనలు 
అందుకే జాగ్రత్త చెల్లెమ్మ , జాగ్రత్త అక్కయ్య
22/04/2013 ; 03:50 PM

No comments:

Post a Comment