Wednesday, 15 May 2013

ఇంకా ఏ తోడు లేదు//



 ఇంకా ఏ తోడు లేదు//

ఎందుకో ఈ రోజు నా మనసు నిశిది లోకంలో
బరువైన నిశ్శబ్దంతో అడుగులు వేస్తుంది
నిశిది లో నిదురపోని ఆ జ్ఞాపకాలు
ఇంకా ఎదురు పడుతూనె ఉన్నాయి
అందుకేనేమో రాత్రి అంత ఆ చేదు జ్ఞాపకాల పడక కుదరక
తన తోడు అనుకున్న నీడ కోసం జల్లెడ పట్టసాగింది
***
ఎప్పుడు తనను వీడని నీడే ఆ లోకం లో వెనక అడుగువేసిందంటే
సంతోషంగా జీవించాలని అనుకున్న తోడు కూడ లేదని తెలిసి   
ఒక్క సారి గుండె కలుక్కుమంది , కన్నీటి మేఘాలు కమ్ముకొచ్చేసాయి 
నా గుండెకు ఇంకా ఏ తోడు లేదు అని తెలిసినట్టుంది
ఉప్పు కెరటాలకు చోటులేకా నా కళ్ళను సాయం అడింగింది

06/04/2013

No comments:

Post a Comment