Wednesday, 15 May 2013

చాల రోజుల తర్వాత ...||


25.02.2013

చాల  రోజుల తర్వాత   నీ  దర్సనం  నా  కనుల  ముంగిట  హరివిల్లై  పలకరించగా
కొన్ని నిమిషాలలోనే ఆ సంతోషం కల గ మిగిల్చి వెళ్ళిపోయావ నేస్తం
నీ మాటకై వేచాను  నీ రాకకై చూశాను
నీ మాటకై వేచిన ఆ  క్షణమున - యెదలో అలజడి రేపిన నీ మౌనం చూసి
గుండె పగిలి ఆవేదనతో  హృదయజ్వాల రగులుకున్నది
నీవు రావు అనే  ఆ క్షణములు నను చుట్టుముట్టి
అవహేళన చేసాయి, ఆ  బాధతో తట్టుకోలేని నా మనసు
నా కనుల తీరానా ఉప్పు కెరటాలను ఓదార్చలేక
ఏనాటికైనా నీ పాదాన్ని తాకుతాయి అనే ఓ చిన్ని ఆశతో
కటిక చీకటిలో  కన్నీటి  కడలితో చేయి కలిపింది
ఎంత అవమానం ఎదురైనా నా మనసు నీ రూపాన్ని చేరగనివ్వదు
నాలోని ఆశను భంగం కానివ్వదు ఆ ఆశే  " నీ వస్తావని "
***
నిండు నూరేళ్ళు నీతో సంతోషం గా జీవించాలని అనుకున్నా
కాని నీతో గడిపినా జ్ఞాపకాల ఒడిలో సేద తీరుతున్న
నీ ప్రేమతీరం అద్దరిన నా ఊహలనావకు చోటు ఇచ్చావు
ఆ తీరం లోని వీచే గాలులు ఓ మధుర జ్ఞాపికలై నను తాకగా
నీ చల్లని స్పర్స తలపే  నా మదిలో ఊయల ఊగసాగెనె
కాని
ఇలలో నీవు లేని క్షణమే నా మదిని హేళన చేయగా
కడలి పిలుపునకు చేరువయ్యాను...ఊపిరి అందక కలిసిపోయాను

No comments:

Post a Comment