19/02/2013 Tuesday
పస్తులుండి పస్తులుండి
పచ్చడి మెతుకులు పరవాన్నమాయే
ఆ ఒక్క మెతుకు గెల్వడానికి
మా చెమట రక్తమాయే
ధవాకాన ఖర్చులకు సరిపోని
వీల్లిచ్చే సొమ్మును చూసి
భగ భగమని మండుతుంది ఈ
చెమటోడ్చిన రక్తం
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ
బానిస బ్రతుకులేన్నాళ్ళు
పొట్టకూటి రణరంగంలో
రెక్కలాడే యంత్రాలమైతిమే
ఒక్కో మెతుకు పోరాటమాయే
బ్రతుకు నడక బలహీనమాయే
బడుగుజీవుల భానిసత్వం
బలిసిపోయే ఈ ఫ్యాక్టరీలు
చెమటోడ్చిన మా చర్మలె ఈ
పెద్దోల్లకు చెప్పులయే
చేద్దాం చేద్దాం ప్రయత్నం
చేద్దాం చేద్దాం
చేసే ప్రతి ప్రయత్నం లో
అలసిపోక సొలసిపొక
బడుగుజీవుల భానిసత్వంతో
బలిసిపోయిన ఈ ఫ్యాక్టరీలకు సవాలు చేసి
కదం తొక్కి ప్రతి పనికి నడుం కట్టి వ్యాపార రణరంగంలో
అడుగుపెట్టి
మన బడుగు జీవుల గెలుపు
సారాన్ని దిక్కులు పిక్కటిల్లేలా ఎలుగెత్తి చాటుదాం
నీ చిన్న
No comments:
Post a Comment