Showing posts with label పస్తులుండి పస్తులుండి పచ్చడి మెతుకులు పరవాన్నమాయే. Show all posts
Showing posts with label పస్తులుండి పస్తులుండి పచ్చడి మెతుకులు పరవాన్నమాయే. Show all posts

Wednesday, 15 May 2013

పస్తులుండి పస్తులుండి పచ్చడి మెతుకులు పరవాన్నమాయే


19/02/2013 Tuesday

పస్తులుండి పస్తులుండి పచ్చడి మెతుకులు పరవాన్నమాయే
ఆ ఒక్క మెతుకు గెల్వడానికి మా చెమట రక్తమాయే
ధవాకాన ఖర్చులకు సరిపోని వీల్లిచ్చే సొమ్మును చూసి
భగ భగమని మండుతుంది ఈ చెమటోడ్చిన రక్తం

ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ బానిస బ్రతుకులేన్నాళ్ళు
పొట్టకూటి రణరంగంలో రెక్కలాడే  యంత్రాలమైతిమే
ఒక్కో మెతుకు పోరాటమాయే బ్రతుకు నడక బలహీనమాయే
బడుగుజీవుల భానిసత్వం బలిసిపోయే ఈ ఫ్యాక్టరీలు
చెమటోడ్చిన మా చర్మలె ఈ పెద్దోల్లకు చెప్పులయే

చేద్దాం చేద్దాం ప్రయత్నం చేద్దాం చేద్దాం
చేసే ప్రతి ప్రయత్నం లో అలసిపోక సొలసిపొక
బడుగుజీవుల భానిసత్వంతో బలిసిపోయిన ఈ ఫ్యాక్టరీలకు సవాలు చేసి 
కదం తొక్కి  ప్రతి పనికి నడుం కట్టి వ్యాపార రణరంగంలో అడుగుపెట్టి
మన బడుగు జీవుల గెలుపు సారాన్ని దిక్కులు పిక్కటిల్లేలా ఎలుగెత్తి చాటుదాం

నీ చిన్న