Friday, 21 June 2013

|| ప్రియా... నీకై మళ్ళీ నే బ్రతికొస్తా




ప్రియా....
ఒకప్పుడు నీ మాటకై నీ రాకకై ఎదురు చూశాను
నీ రాక కోసం ఎదురు చూసినపుడు
మా కనుల ముంగిట హరివిల్లై కనిపిస్తావు....
నీ మాట  కోసం ఎదురు చూసినపుడు
యెదలో అలజడి రేపే మౌనంతో వేల్లిపోతావు
ఇవన్ని నిను తాకె  కొన్ని నిమిషాలలోనే కల గ మిగిలేనని  
కడలి పిలుపునకు చేరువయ్యాను...ఊపిరి అందక కలిసిపోయాను

ఇప్పుడు నా కనుల ముంగిట తచ్చాట్లడుతున్నాయి
నా కోసం చూస్తున్నా నీ ఎదురు చూపులు

అద్దం లాంటి నా గుండె పగిలిపోతుంది
నా సర్వం అనుకున్న నిన్ను అలా చూస్తుంటే 

ఇప్పుడు పగిలిన అద్దపు ముక్కలు కొట్టుమిట్టాడుతున్నాయి
చిక్కనంత దూరంలో ఆకాశపుటంచులలో...
అగుపించని నీ జ్ఞాపకాల మబ్బులలో

మదిలోని తీపి బాదలన్ని పంచుకుందాం అనుకుంటే
ఆకాశంలో వచ్చివేల్లె మెరుపులా పరిగెత్తింది నా కాలం కూడా

ప్రియా... నీకై మళ్ళీ నే బ్రతికొస్తా
వేణువులో ఊపిరినై, సంద్రంలో ఉప్పెననై,
మళ్ళీ నే బ్రతికొస్తా ..........,,,,,,
20.06.2013

No comments:

Post a Comment