Thursday, 20 June 2013

అయ్యో నాన్నకి అంత కష్టం వచ్చిందా .........

అయ్యో ఇతను దిక్కులేని చావు చచ్చాడు 
ఆకరికి నేను బుడ్చాల్సి వస్తుంది అంటూ కాటికాపరి 
గుంత తవ్వ సాగాడు 

ఇంతలో ఒక పాప ఏడుపు స్వరం

అది విన్న కాటికాపరి బదులుగా ఎవరివి నీవు అని

నేను .........!!!
తన చల్లని చేతి స్పర్సతో
సేద తీరాను అమ్మ గర్బంలో
9 నెలలు పరిగెట్టాను అమ్మ గర్బంలో
నన్ను బుజ్జగించే ఆ మాటలినాలని
ఈ అందమైన లోకంలో తన అడుగులకు
నా చిన్నిచిన్ని అడుగులు జత చేయాలనీ
కాని………,,,
ఒక రోజు అమ్మ గర్బము నుండి పడ్డాను ఈ భూమి పై
ఎవరివైతే చల్లని చేతులనుకున్ననో అవే చేతులు
అమ్మ ఒడి నుండి కర్కశంగా మృత్యువు ఒడిలో చితిమేసిన
ఆడపిల్లని చనిపోయిన ఆ నాన్నకు ఆడకుతురిని...
20 సంవత్సరాల క్రితం …..,,,
*******
అవునా నువ్వే ఆ కూతురివైతే
ఇప్పుడు పూడుస్తున్న ఈ అనాధ శవం మీ నాన్ననే
అప్పుడు ఉన్న ఒక్క దిక్కు నిన్ను కాలదన్నుకొని
చివరి రోజుల్లో ఆ నలుగురు లేక చూసే దిక్కులేక
కుక్క చావు చచ్చాడు
*****
అయ్యో నాన్నకి అంత కష్టం వచ్చిందా
త్వరగా పూడ్చన్డీ నాన్నను నేను ఒదారుస్తాను అంటూ
కానరాని లోకం లో విలపిస్తూ……..,,,,,,,,,,,
19/06/2013

No comments:

Post a Comment