Thursday, 23 May 2013

|| అస్తమిస్తున్నా జీవితాలెన్నో||


జానెడు పొట్టలో ఒక మెతుకు, గంజిబొట్టు పడి సానాల్లైంది 
మొక్కకుంటే సచ్చిపోతాం అని నీ కాళ్ళు మొక్కుతా బాంచన్ అంటూ
పూట గడవక సాగుతున్నా బానిస జీవితాలెన్నో ...

మారుతున్న కాలాలతో పాటు వడి వడి గా పరిగెడుతూ
మన ఆకలి తీర్చేందుకు ఐదువేళ్ళు మనకిచ్చి
పస్తులతో అస్తమించే  రైతన్నలు ఎందరో......

పారిశ్రామిక మిల్లులలో చాలి చాలని జీతభత్యాలతో
కార్మికుల బ్రతుకు నడకలు ఆగిపోలేక సాగుతున్న 
శ్రామికత్వం ఎంతో మరెంతో ........

జీవన దారిలో ఎన్నో గతుకులు  బ్రతుకు నావకు ఎన్నో ఎత్తు పల్లాలు
సునామీల రాక్షస నోటికి చిక్కి జానెడు పొట్ట కోసం గింజుకుచస్తున్నా 
పల్లెకారులేందరో......

తన చేతులను వదలని జిగటమన్ను ముద్ద
ఆ కుటుంబ మట్టి కుండలను ముద్డాడుతూ మెరుగు పరుస్తూ 
ఎండకు ఎండి,వానకు తడిసి తన అడుగంటినా కుండ పగుల్లను ముసివేసుకుంటున్నా
కుమ్మరులేందరో........ఆకలి అరుపులు బయటకు రాకుండా…….,,
*****
మా బ్రతుకులు మారవు బిడ్డా ...
కడుపులో మెతుకు పొరపాటున కదులుతుందో లేక
నీళ్లు పొరపాటున తోనికిసలాడుతాయో  అని
బానిసల కుర్చీ మీద దర్జాగా కూర్చుంటున్న దొరసానులు
వాళ్ళని కట్టుకొని ఊరెగుతున్నాదొరలున్నంతకాలం

21/05/2013  చిన్నమాత్యుస్

No comments:

Post a Comment